రిలయన్స్ జియో మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించింది. ఈ ప్యాక్ తీసుకున్నవారు క్రికెట్, ఫుట్‌బాల్ సహా ఇతర స్పోర్ట్స్‌ను వీక్షించొచ్చు. రిలయన్స్ జియో రూ.3,333ప్లాన్‌తో రోజుకు 2.5జీబీ డేటా, 100ఎసెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 365 రోజులు. జియోటీవీ మొబైల్ యాప్ ద్వారా ఫ్యాన్‌కోడ్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్ ప్రత్యేకత.