Homeఆంధ్రప్రదేశ్గుడ్ న్యూస్.. హన్మకొండ​లో JOB MELA

గుడ్ న్యూస్.. హన్మకొండ​లో JOB MELA

ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: ఈ 19న వరంగల్​ లోని ములుగు రోడ్డులో జాబ్​ మేళా నిర్వహింబోతున్నట్టు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ అధికారి ఎం మల్లయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాకు చెందిన నిరుద్యోగులు, యువత ఈ జాబ్​ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ములుగు రోడ్ లోని ప్రభుత్వ ఐటిఐ క్యాంపస్ వద్ద గల నిర్వహించే ఈ జాబ్ మేళా ద్వారా యాక్సిస్ బ్యాంక్ లో బిజినెస్ డెవలప్మెంట్, ఎగ్జిక్యూటివ్స్ సుమారు 80 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయస్సు గల యువతీ యువకులు 19వ తేదీన ఉదయం 11 గంటలకు జరిగే జాబ్ మేలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9848895937 లేదా 9700922136 నంబర్లను ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు.

Recent

- Advertisment -spot_img