Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన

GOOD NEWS: కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. గురువారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక ప్రకటన చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో మొత్తం 13 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మూడు స్థానాల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని అన్నారు. ఎమ్ఐఎమ్ ఒక స్థానం గెలుస్తుంది.. ఇక బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తగిన గర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మళ్లీ బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడటం ఖాయమని అనుమానం వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img