ఏపీ మహిళలు త్వరలో శుభవార్త విననున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే ఉచిత ప్రయాణం అమలవుతున్నందున.. మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావు లేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడతామన్నారు. రవాణాశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి కడప విచ్చేసిన రాంప్రసాద్‌రెడ్డికి తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గడిచిన ఐదేళ్లలో జగన్ ముఠా దోపిడీ చేసిన ప్రజాధనాన్ని వడ్డీతో సహా కక్కిస్తామన్నారు.