Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. వృద్ధులకు మోదీ కీలక హామీ

శుభవార్త.. వృద్ధులకు మోదీ కీలక హామీ

ప్రధాని మోదీ వృద్ధులకు కీలక హామీ ఇచ్చారు. 70 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారికి కూడా ఆయుస్మాన్ భారత్ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. దీంతో పాటు ముద్రా రుణాల పరిమితిని రూ. 20 లక్షలకు పెంచుతామని వెల్లడించారు. మరో 3 కోట్ల గృహాలు నిర్మిస్తామని చెప్పారు. భవిష్యత్తులో పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామని చెప్పారు.

అలాగే.. ప్రజల జీవిత ప్రమాణాలు మార్చడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. ఇదే మోదీ ఇస్తున్న గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు, పేద వర్గాలకు తమ మేనిఫెస్టోలో ప్రధాన్యత ఇచ్చామన్నారు. గత పదేళ్లలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img