Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్… త్వరలో కొత్త రేషన్ కార్డులు..!

గుడ్ న్యూస్… త్వరలో కొత్త రేషన్ కార్డులు..!

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. గత కొంత కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రజా పాలన పేరుతో లబ్దిదారుల నుంచి దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img