తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) బుధవారం ప్రకటన జారీ చేసింది. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ పరిధిలో 1088 పోస్టులు, వైద్య విధానపరిషత్‌లో 183, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో 13 పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 21 తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 10న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.