ఏపీలో అర్హులైన పెన్షన్ దారులు డిసెంబర్ మొదటివారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్ దారులు గ్రామంలో ఒకటి,రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి వారికి ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యల తీసుకోవాలని స్పష్టం చేశారు.