కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అటు రేషన్ కార్డుదారులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు.