RBI గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి రెపో రేటు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఇవాళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెపో రేటు 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరడం గమనార్హం. ఈ తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.