ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 65,840 కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 71,820కి చేరుకుంది. అలాగే వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,290గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 82,900గా కొనసాగుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,840గా ఉండగా… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,820గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో వెండి రేటు రూ. 82,900 గా ఉంది.