రైతుల కోసం ‘పీఎం కిసాన్ మాన్‌ధన్ యోజన’ను కేంద్రం అమలు చేస్తోంది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఈ స్కీమ్‌లో చేరిన వారు 60 ఏళ్లు నిండే వరకు ప్రీమియం చెల్లించాలి. 60 ఏళ్లు దాటిన తర్వాత రైతులకు ప్రతినెలా రూ.3 వేల పెన్షన్ అందుతుంది. పథకంలోని రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. ప్రీమియం వివరాలు, దరఖాస్తు చేయడం కోసం కామన్ సర్వీస్ సెంటర్లను సంప్రదించవచ్చు.