అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గడిచిన అయిదేళ్లలో జగన్ నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల ఫించన్ ఇస్తానని చెప్పి, తర్వాత విడతల వారీగా ఇస్తానని మాట మార్చారు. తను అధికారంలోకి వచ్చి ఉంటే మొదటి నుంచే రూ.3వేల ఫించన్ ఇచ్చేవాడినని బొబ్బిలి సభలో చంద్రబాబు తెలిపారు.