ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ నుంచి 33 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి ప్రారంభిం మాట్లాడారు. ‘ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతాం. HYD సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను నడపాలన్నదే మా ఆలోచన’ అని అన్నారు.