వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు గా వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50.. వాణిజ్య సిలిండర్ల ధర రూ.60 నుంచి రూ.70 వరకు తగ్గుతుందని కథనాలు వస్తున్నాయి.