Homeహైదరాబాద్latest NewsGood News.. ఒంటి పూట బడులు డిక్లేర్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Good News.. ఒంటి పూట బడులు డిక్లేర్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

వేసవి తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఒంటి పూట బడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటి పూట బడులు పెట్టనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బడులు నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img