Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే?

GOOD NEWS: ఈ నెల 17, 25న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకంటే?

ఈ నెల 17, 25న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బక్రీద్ ఎప్పుడన్న విషయంలో ఈ సారి కొంత గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వ సెలవు విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. తాజాగా ఈ సంశయానికి తెరదించుతూ తెలంగాణ ప్రభుత్వం 17ను సెలవు దినంగా ప్రకటించింది. బక్రీద్‌ 17 అని కొందరు, 18 అని కొందరు చెప్పడంతో ఏ రోజు నిర్వహించుకుంటే ఆ రోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. జూన్ 17 సోమవారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు రెండు రోజుల సెలవులు లభించనున్నాయి. బ్యాంకులకైతే రెండో శనివారం కూడా కలిసి రావడంతో వరుసగా మూడు రోజులు మూతపడనున్నాయి. అలాగే, ఈ నెల 25న ఈద్-ఇ-ఘాదిర్‌ను పురస్కరించుకుని మరో సెలవు ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img