వ్యాపారం ప్రారంభించాలని లేదా విస్తరించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎమ్ ముద్ర యోజన( పీఎమ్‌ఎమ్‌వై) ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుతో రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేయడం కోసం https://mudra.org.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.