లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ వాసులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ వినిపించారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఎంపీ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.