Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ప్రయాణానికి 5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

GOOD NEWS: ప్రయాణానికి 5 నిమిషాల ముందు ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

ఏటా చాలామంది ట్రైన్‌లో ప్రయాణం చేస్తారు. అయితే ట్రైన్ టికెట్ మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే జనరల్‌లో వెళ్లాల్సి ఉంటుంది. రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాగంటే.. రైల్వేస్టేషన్ కి వెళ్ళాక మీరు ఎక్కాలనుకున్న ట్రైన్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. రైల్వేశాఖ ప్రిపేర్ చేసిన ఆన్ లైన్ చార్ట్ ద్వారా ట్రైన్ లో సీట్లు ఖాళీగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్ పై క్లిక్ చేస్తే.. చార్ట్ వేకెన్సీ అనేది ఓపెన్ అవుతుంది. లేదా ఆన్ లైన్ ఛార్ట్స్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ట్రైన్ పేరు లేదా ట్రైన్ నంబర్, తేదీ, ఏ స్టేషన్ లో ఎక్కుతారో ఆ స్టేషన్ పేరు ఎంటర్ చేసి గెట్ ట్రైన్ చార్ట్ పై క్లిక్ చేయాలి. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్ ఇలా తరగతుల వారీగా ఒక చార్ట్ కనిపిస్తుంది. అందులో సీట్లు ఏమైనా ఖాళీగా ఉంటే కనుక టికెట్ బుక్ చేసుకోవచ్చు. సీట్లు లేకపోతే చార్ట్ లో సున్నా అని చూపిస్తుంది. కోచ్ నంబర్, బెర్త్ సహా అన్ని వివరాలు ఆ చార్ట్ లో కనిపిస్తాయి

Recent

- Advertisment -spot_img