Homeరాజకీయాలుకాంగ్రెస్​కు దామోదర గుడ్​ బై?

కాంగ్రెస్​కు దామోదర గుడ్​ బై?

– ఎన్నికల వేళ బిగ్​ షాక్​?
– తన అనుచరులకు టికెట్లు దక్కకపోవడంతో అసంతృప్తి
– ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం!

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీకి గట్టి దెబ్బ పడే పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్​ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆ పార్టీకి గుడ్​ బై చెప్పబోతున్నట్టు సమాచారం. మూడో లిస్ట్​లో తన అనుచరులకు టికెట్​ దక్కకపోవడంతో రాజనర్సింహ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నారాయణఖేడ్ నుంచి తన అనుచరుడు సంజీవరెడ్డికి.. పటాన్ చెరు నుంచి శ్రీనివాస్ గౌడ్‌కు టిక్కెట్లు ఇప్పించుకోవాలని దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం ఆ స్థానంలో ఇతర నేతలకు టికెట్లు ఇచ్చింది. దీంతో దామోదర తీవ్ర అసంతృప్తికి గురైనట్టు సమాచారం. కాంగ్రెస్​ పార్టీలో టికెట్ల అంశం చిచ్చు రేపుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్​ లిస్ట్​, సెకండ్​ లిస్ట్​ లోనూ అసంతృప్తి చెలరేగగా తాజాగా మూడో జాబితా విడుదలైనా ఇదే పరిస్థితి నెలకొన్నది. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కోసం కాటా శ్రీనివాస్ గౌడ్ గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. దీంతో, ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశమయినట్టు సమాచారం. పటాన్​ చెరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కాట శ్రీనివాస గౌడ్​ పనిచేస్తుంటే ఆయనను కాదని.. ఇటీవల పార్టీలో చేరిన నీలం మధుకు ఎలా టికెట్​ కేటాయించారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక కాటా అనుచరులు సైతం టికెట్​ దక్కకపోవడంతో వీరంగం సృష్టించారు.

Recent

- Advertisment -spot_img