Homeఫ్లాష్ ఫ్లాష్గూగుల్ డేటాను ఇలా బ్యాకప్ చేసుకోండి..

గూగుల్ డేటాను ఇలా బ్యాకప్ చేసుకోండి..

న్యూఢిల్లీ: గూగుల్ ప్లే మ్యూజిక్‌ను ఈ నెల 24న డిలీట్ చేయబోతుంది. అందులో భాగంగా గూగుల్ ప్లే మ్యూజిక్‌లో ఉన్న లైబ్రరీ, డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తామని గూగుల్ తెలిపింది.

ఒకసారి ఈ డేటా డిలీట్ చేసిన తర్వాత మళ్లీ రికవర్ చేయడానికి వీలుపడదని కూడా తేల్చి చెప్పింది. ఇప్పటికే యూజర్లను ప్లే మ్యూజిక్ నుంచి యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు కూడా గూగుల్ వెల్లడించింది.

ఒకవేళ మీరు ఏమైనా మార్పులు చేసి ఉంటే.. ఇప్పటికీ వాటిని ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఒకవేళ మీరు గూగుల్ ప్లే మ్యూజిక్ లైబ్రరీ, డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 24లోపు గూగుల్ టేక్ అవుట్ నుంచి చేసుకోవచ్చని కూడా గూగుల్ చెప్పింది.

గతేడాది డిసెంబర్‌లోనే గూగుల్ ప్లే మ్యూజిక్ ఆపరేషన్లను నిలిపేసింది. దానిని యూట్యూబ్ మ్యూజిక్‌గా మార్చింది.

Recent

- Advertisment -spot_img