గూగుల్ ఫొటోస్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్నది. అదే ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్. ఇదో ఆర్టిఫిఫియల్ ఇంటిలిజెన్స్ సౌకర్యం. దీంతో గ్యాలరీల్లోని ఫొటోలను వెతికేందుకు కళ్లు కాయలు కాచేలా చూడనక్కర్లేదు. సింపుల్‌గా ‘వాయిస్ కమాండ్‌తో అడిగితే చాలు.. కావాల్సిన ఫొటోలు తెరపైకి వచ్చేస్తాయి. ఈ ఫీచర్ బీటా వెర్షన్ రూపంలో పరిమిత యూజర్లకు అందుబాటులో ఉంది.