Homeబిజినెస్‌Google Reliance jio : అతి తక్కువ ధరకు 5జీ స్మార్ట్ ఫోన్

Google Reliance jio : అతి తక్కువ ధరకు 5జీ స్మార్ట్ ఫోన్

Google Reliance jio : తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్లను గూగుల్‌తో కలిసి రిలయన్స్‌ జియో డెవలప్‌ చేస్తున్నదని ముకేశ్‌ వెల్లడించారు. గత ఏడాది గూగుల్‌ భాగస్వామ్యంతో రిలయన్స్‌ జియోఫోన్‌ నెక్స్‌ phone ప్రవేశ పెట్టారు.క్లౌడ్‌ ద్వారా 5జీ ఎనేబుల్డ్‌ సొల్యూషన్స్‌ను అందిస్తామని రిలయన్స్‌ చైర్మన్‌ చెప్పారు. దేశంలో అజూర్‌ ఎకోసిస్టమ్‌ను విస్తరించడానికి మైక్రోసాఫ్ట్‌తో చేతులు కలిపామని, ప్రతీ ఒక్కరికీ టెక్నాలజీ ప్రయోజనాల్ని అందించడానికి మెటాతో, క్లౌడ్‌ స్కేల్‌ డాటా సెంటర్లు, 5జీ ఎడ్స్‌ లోకేషన్స్‌లో ఉపయోగించే టెక్నాలజీల కోసం చిప్‌ దిగ్గజం ఇంటెల్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. క్లౌడ్‌-నేటివ్‌, ఫ్లెక్సిబుల్‌ 5 ఇన్‌ఫ్రాను అభివృద్ధిపర్చేందుకు క్వాల్‌కామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామన్నారు. ఎరిక్‌సన్‌, నోకియా, శామ్‌సంగ్‌, సిస్కో వంటి టెక్నాలజీ ప్రొవైడర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నామని ముకేశ్‌ వెల్లడించారు

Recent

- Advertisment -spot_img