Google Search: గూగుల్‌లో మనం రోజు రకరకాల విషయాలు, మనకు తెలియని వాటిని తెలుసుకోవడానికి ఇంకా చాలా రకాల విషయాలు సెర్చ్ చేస్తూ ఉంటాం. అయితే గూగుల్‌లో కొన్ని విషయాలు సెర్చ్ చేయకూడదని మీకు తెలుసా? ఆ విషయాలు ఏంటో తెలియకుండా సెర్చ్ చేస్తే మీరు చిక్కుల్లో పడతారు. అందుకు ఆ విషయాలు ఏంటో ఇప్పుడే తెలుసుకోండి.. బాంబు తయారు చేసే మార్గాన్ని గూగుల్‌లో వెతికే పొరపాటు చేయకండి. అలా చేస్తే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. అలాగే ఎలా హ్యాక్ చేయాలో సెర్చ్ చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. గూగుల్‌లో అశ్లీల కంటెంట్‌ను శోధించే పొరపాటు ఎప్పుడూ చేయకండి. చాలామంది పైరేటెడ్ సినిమాలను ఉచితంగా పొందాలనే ఆశతో గూగుల్‌లో వెతకడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం నేరం. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండండి.