Homeజాతీయంగూగుల్‌లో వీటి కోస‌మే ఎక్కువ‌గా వెతికార‌ట‌!

గూగుల్‌లో వీటి కోస‌మే ఎక్కువ‌గా వెతికార‌ట‌!

ముంబాయి: కరోనా మహమ్మారితో ప్రపంచం అల్లాడిపోతున్న వేళ గూగుల్ ఎక్కువమంది భారతీయులు శోధించింది దేని కోసమో తెలుసా.. రష్యా కొవిడ్ వ్యాక్సిన్ గురించేనట! ఆగస్టు నాటి సెర్చ్ ట్రెండ్స్‌ను గూగుల్ విడుదల చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, పాకిస్థాన్-ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ వంటివాటిని ఎక్కువ మంది వెతికిన వాటిలో ఉన్నాయి. ఈ మేరకు ‘స్పుత్నిక్’, ‘స్పుత్నిక్ వ్యాక్సిన్’ కోసం వరుసగా 3,300 శాతం, 2,700 శాతం శోధనలు పెరిగినట్టు గూగుల్ తెలిపింది. అలాగే, భారత స్వాతంత్ర్య దినోత్సవం కోసం 3,750 శాతానికి పైగా సెర్చ్‌లు జరిగినట్టు గూగుల్ నివేదిక పేర్కొంది.
టాప్-10లో ఉన్నవి ఇవే..

  1. అమిత్ షాకు కరోనా పాజిటివా?
  2. దుస్తులపై కరోనా వైరస్ ఎంతకాలం ఉంటుంది?
  3. కరోనా వైరస్‌కు రష్యా మందు కనుగొందా?
  4. జియోలో కరోనా కాలర్ ట్యూన్‌ను ఎలా ఆపాలి?
  5. కరోనా వైరస్‌ను ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు?
  6. ఒళ్లు నొప్పులు కరోనాకు సంకేతమా?
  7. కరోనాలో ఉష్ణోగ్రత ఎంత?
  8. కరోనా లక్షణాలు ఎన్ని రోజుల్లో కనిపిస్తాయి?
  9. ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిందా?
  10. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి కరోనా ఎలా సోకింది?
RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img