ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామంలో ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో గోపాల కాలువలు, ఆంజనేయ స్వామికి అభిషేకము, చందన ధారణము, 24 గంటల ఏక నామస్మరణ మరియు భజన చేయడం జరిగినది. అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి అర్చకులు కాకుస్తం లింబాద్రి మాజీ సర్పంచులు జంగిలి ప్రభాకర్ గంధం గంగారం ఆయిల్ లేని అందాలు పందిరి తిరుపతి వేముల రమాదేవి ఆయన లేని విద్యాసాగర్ రావు ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు.