Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్​కు పాలన చేతకావడం లేదు.. ఎంపీ రఘునందన్​ రావు సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్​కు పాలన చేతకావడం లేదు.. ఎంపీ రఘునందన్​ రావు సంచలన వ్యాఖ్యలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్​ రెడ్డిపై మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్​కు పరిపాలన చేతకావడం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశామని సీఎం, మంత్రులు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రుణమాఫీ సగమే చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి నేడు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఒక్క కాళేశ్వరంలోనే రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్న రేవంత్ , అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచినా విచారణ కమిషన్, విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇన్ని నెలలు ఉన్నా కూడా ఆయనకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వస్తున్న వార్తలను రఘునందన్​ రావు ఖండించారు. కేసీఆర్​లాగానే రేవంత్ రెడ్డి కూడా తప్పులు చేస్తున్నారని, ఆయనకు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారని తెలిపారు.

Recent

- Advertisment -spot_img