HomeతెలంగాణRaj Bhavan:రాజ్‌భవన్‌పై నారాజ్

Raj Bhavan:రాజ్‌భవన్‌పై నారాజ్

రాజ్‌భవన్‌పై నారాజ్

  • బిల్లు ఆమోదించాలంటూ ఆర్టీసీ కార్మికుల ఉద్యమం
  • గవర్నర్ ఇంటికి భారీ ర్యాలీ
  • రాజ్ భవన్ ముందు బైఠాయింపు
  • ప్రభుత్వాధినేతకు వ్యతిరేకంగా నినాదాలు
  • తానెప్పుడూ ఆర్టీసీ కార్మికుల వైపే నంటున్న గవర్నర్
  • ప్రభుత్వానికి ఐదు ప్రశ్నలు

ఇదేనిజం, హైదరాబాద్: రాజ్ భవన్ పై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తూ రూపొందించిన బిల్లును గవర్నర్ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లోని పలు డిపోలీ పరిధిలోని ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ వద్దకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు గవర్నర్ మాత్రం తాను ఆర్టీసీ కార్మికుల పక్షమే వహిస్తున్నానంటూ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకోవడంతో రాజ్ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకోవడంతో ఖైరతాబాద్ జంక్షన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఖైరతాబాద్ జంక్షన్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

యూనియన్‌ నాయకులకు గవర్నర్‌ ఆహ్వానం
మరోవైపు ఆర్టీసీ యూనియన్‌ నాయకులను గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాయకులతో చర్చిస్తానని తెలిపారు. దీంతో 5 మంది ఆర్టీసీ యూనియన్ నాయకులు రాజ్ భవన్ కు వెళ్లారు. ఆర్టీసీ విలీనం బిల్లుపై వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. థామస్ రెడ్డి సహా 5 గురు నేతలు గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారు.

గవర్నర్ కోరుతున్న అంశాలివే..

  1. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్‌లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవు.
  2. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవు.
  3. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం… వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని ప్రశ్నించిన గవర్నర్.
  4. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.
  5. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్.

Recent

- Advertisment -spot_img