Governer:తెలంగాణ గవర్నర్ తమిళి సై సోమవారం ఉస్మానియా హాస్పిటల్‌లో అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కులి కుతుబ్ షా బ్లాక్ ఉస్మానియా పురాతన భవనాన్ని పరిశీలించారు. మరుగుదొడ్డి దగ్గరకు వెళ్లేసరికి గవర్నర్ ముక్కు మూసుకున్నారు. ఇక్కడ ఎలా ఉంటున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ రోగులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నానన్నారు. జస్టిస్ ఫర్ ‘OGH’ పేరుతో ఉన్న ట్వీట్‌కు గవర్నర్ రిప్లై ఇచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. కాగా తమిళిసై ఉస్మానియా ఆస్పత్రి తనిఖీకి వస్తే.. ఆస్పత్రి సూపరింటెండెంట్ అందుబాటులోలేరు. సెక్రటేరియట్‌లో మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ సమావేశంలో ఆసుపత్రి వర్గాలు పాల్గొన్నాయి.