Homeహైదరాబాద్latest Newsగ్రీన్​ ఫీల్డ్​ రోడ్ల పనులపై ప్రభుత్వం​ ఫోకస్.. త్వరలోనే..!

గ్రీన్​ ఫీల్డ్​ రోడ్ల పనులపై ప్రభుత్వం​ ఫోకస్.. త్వరలోనే..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్ )ను ఓఆర్ ఆర్ కు అనుసంధానం చేసేందుకు ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హెచ్‌ఎండీఏకు చెందిన హైదరాబాద్‌ గ్రోత్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (హెచ్‌జీసీఎల్‌) ఈ పనులు చేపడుతోంది. మానస పుత్రిక ఫోర్త్ సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లను సీఎం రేవంత్ రెడ్డి నిర్మించనున్నారు.ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పాయింట్ల నుంచి ఫోర్త్ సిటీ మీదుగా ట్రిపుల్ ఆర్ వరకు మొత్తం 9 రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రోడ్ల నిర్మాణం పూర్తయితే ఫోర్త్ సిటీ డెవలప్ మెంట్ తో పాటు ట్రిపుల్ ఆర్ వరకు కనెక్టివిటీ ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్లన్నీ 300 అడుగులతో నిర్మించనున్నారు. ఇప్పటికే అవసరమైన భూమి కోసం హెచ్‌జీసీఎల్‌ అధికారులు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు దాదాపు 41 కిలోమీటర్ల మేర భూమిని సేకరించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
ORR ఎగ్జిట్ పాయింట్ల నుండి గ్రీన్ ఫీల్డ్ రోడ్లు నిర్మించబడతాయి. ORRలో 17 ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి, వీటిలో 9 పాయింట్ల నుండి రోడ్లు నిర్మించబడతాయి. రావిర్యాల ORR ఎగ్జిట్ నంబర్ 13 నుండి నాల్గవ నగరం మీదుగా కొంగర కుర్దు నుండి కొంగరకలాన్, మీర్ఖాన్‌పేట వరకు మొదటి 18 కి.మీ. ముచ్చెర్ల, కుర్మిద్ద, కడ్తాల్, ముద్విన్, ఆమనగల్ మీదుగా ఆకుతోటపల్లి ట్రిపుల్ ఆర్. కలుపుతూ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. 50 శాతం భూసేకరణ పూర్తయిన వెంటనే ఈ రహదారి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం త్వరలో టెండర్లు పిలవనున్నారు. 9రోడ్లకు గాను 918 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img