తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వం పేదలకు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతోపాటు పాత వాటికి పేరుమార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే, కొత్త రేషన్ కార్డులకు అర్హత ప్రమాణాలను కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి మీరు నిబంధనలను తనిఖీ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం మూడు రకాల రేషన్ కార్డులను జారీ చేయనుంది. మొదటిది అంత్యోదయ ఆహార భద్రత కార్డు, రెండవది ఆహార భద్రత కార్డు, మూడవది అంత్యోదయ అన్న యోజన కార్డు. మొదటి రకం కార్డులో 6 కిలోల బియ్యం, రెండో రకం కార్డులో 10 కిలోల బియ్యం, మూడో రకం కార్డులో 35 కిలోల బియ్యం అందజేస్తారు.