తెలంగాణలో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా.. పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఇచ్చే కాంగ్రెస్ పథకం కోసం వేగంగా మార్గదర్శకాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరుతో చేసిన తప్పిదాలను, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కసరస్తు చేస్తోంది.
త్వరలోనే ఇంటి నిర్మాణానికి గల అర్హులను గుర్తించి ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజాపాలనలో 25లక్షలకు పైగా ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు ఇళ్లులేని వారు, భూమి ఉండి ఇళ్లు లేనివారిని ప్రభుత్వం గుర్తించేందుకు ప్రణాళికలను తయారు చేస్తుంది. అలాగే గతంలో గృహలక్ష్మీ పథకం అప్లై చేసుకున్న వారికి కూడా ప్రియారిటీ ఉండనున్నట్లు సమాచారం. అర్హులందరికీ ఇళ్లు అందజేస్తే. నిజంగా ప్రభుత్వం ఇచ్చిన మాటపైన నిలబడినట్లు అవుతుంది.