- తాగుబోతులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల
- మందు బాటిల్లతో పాఠశాల ఆవరణం
- విద్య నేర్చుకున్న దాంట్లో విచ్చలవిడి చేష్టలు
- మద్యం మత్తులో నా భూతో నా భవిష్యత్తు అంటున్న తాగుబోతులు
- క్షుద్ర పూజలతో ఆకతాయిల అల్లర్లు
ఇదేనిజం జగిత్యాల్ రూరల్: విద్యాబుద్ధులని నేర్చుకునే ఆవరణంలో మందు బాబులు క్షుద్ర పూజలతో మందు సీసా బాటిల్లతో చిందరమందరం అవుతున్నాయి . ఇది ఎక్కడో కాదు జిల్లా నుండి కూతవేటు దూరంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సెలవు దినాలు కావడంతో ఆకతాయి అల్లరి ముఖాలు,పాఠశాల సెలవు దినాల్లో ఆవరణము మొత్తం మద్యం తాగుతూ బీరు సీసాల పగలగొట్టి క్షుద్ర పూజలు చేస్తూ..గందరగోళం సృష్టిస్తున్నారు. పాఠశాల ప్రారంభం కాగా వచ్చి చూసేసరికి ఇలా దర్శనం ఇవ్వడంతో ఉపాధ్యాయులు షాక్ అవుతున్నారు .విద్యార్థులు విద్యాబుద్ధులు నేర్చుకునే ఆవరణము ఇలా చేయడం బాధాకరమని, స్థానికులు,ప్రభుత్వ సంబంధిత అధికారులు స్పందించిలని ఆకతాయిలను అరికట్టాలని కోరారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: ప్రధానోపాధ్యాయులు చలపతి
పాఠశాల ఆవరణ మొత్తం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ప్రధానోపాధ్యాయులు శేషా చలపతి కోరారు.పాఠశాల ఊరికి చివరన ఉండడటం వలన ఆకతాయిలకు అడ్డగా మారిందని,గ్రామ యువకులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరైనా దాతలు ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.
తాగుబోతులు కనిపిస్తే సమాచారాన్ని ఇవ్వండి: ఎంపీడీవో రమాదేవి
ఎంపిడిఓ రమాదేవి మాట్లాడుతూ పాఠశాల అంటే దేవాలయము కన్నా విలువైనది అట్టి పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ పాడు చేస్తున్నటువంటి మద్యపానం ప్రియులు దయచేసి ఎలాంటి ఆకృత్యాలు చేయకుండా పాఠశాలను కాపాడుకోవాలి, వారి పద్ధతి మార్చుకొని యెడల కఠినమైన చర్యలు తీసుకోబడును.