Homeజిల్లా వార్తలుక్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన ప్రభుత్వ విప్ అడ్లూరి

ఇదే నిజం,గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ కన్వీనర్ పురంశెట్టి గౌతం ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్లపెల్లి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కి సంబంధించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో శనివారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పోటీలో గెలుపొందిన జట్టు సభ్యులకు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ భీమ సంతోష్,మాజీ సర్పంచులు రేవల్ల సత్యనారాయణ గౌడ్,పురంశెట్టి వెంకటేశం,చిర్ర గంగాధర్,పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్,నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img