ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, దోనూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి ఆధ్వర్యంలో ఎరువుల గోదాంను ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ ఎరువుల గోదాం ప్రారంభించడంతో దోనూర్, గాదేపల్లి, తీగల ధర్మారం గ్రామ రైతుల బాధలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, డి సి ఓ మనోజ్, చెర్ల రాజేశం, జైన చైర్మన్, సౌల నరేష్, ఎంపీడీవో,ప్రవీణ్, వేముల రాజేష్, చిల్ముల లక్ష్మణ్, ముత్యం గంగారం సంఘ నర్సింలు, ప్రకాష్ రావు, చిరుత మల్లేష్, జంగిలి మధుకర్, దాసరి పురుషోత్తం, సురేందర్, ముత్యం సంతోష్, పల్లి అశోక్, జంగిలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.