Homeహైదరాబాద్latest Newsశ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను సందర్శించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాల స్థానిక (నైట్ కాలేజి)ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రిజనర్ జాయింట్ డైరెక్టర్(అరేజేడీ) మరియు రెవెన్యూ,మున్సిపల్ అధికారులతో కలిసి శనివారం రోజున సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల ధర్మపురిలోనీ నైట్ కాలేజిలో టీచింగ్ స్టాఫ్ లేక కళాశాలను మూసివేయడం జరిగిందనీ, తను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇట్టి కళాశాలను తిరిగి ప్రారంభించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని, కళాశాలను పునః ప్రారంభించెంత వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులతో మాట్లాడి ఔట్ సోర్సింగ్ పద్ధతితో ఉద్యోగులను,పారిశుద్ధ్య సిబ్బందిని మరియు ఉపాధ్యాయులను కళాశాలలో నియమించాలని వారికి తెలపడం జరిగిందని,దానికి సుమారు 30 లక్షల రూపాయల వరకు సంవత్సరానికి ఖర్చు కావడం జరుగుతుందని, అరెజెడీ కి కూడా ఇట్టి కళాశాల పైన నివేదికను పై అధికారులకు పంపించి తన దృష్టికి తీసుకురావాలని తెలపడం జరిగిందని,అదే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులతో కలిసి ఈ ప్రాంత త్రాగు,సాగు నీటి విషయం గురించి పలు మార్లు చర్చించడం జరిగింది, ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల, ఐటిఐ కలశాల,పాల్ టెక్నిక్ కలశాల ఏర్పాటులో తన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img