Homeజిల్లా వార్తలుఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సతీమణి కాంతకుమారి,మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు

ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ సతీమణి కాంతకుమారి,మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యతిథులుగా ధర్మపురి శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతకుమారి,మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ,మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ గ్రంథాలయ చైర్మన్ కటారి చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులను సన్మానించి నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేసి భవిష్యత్తులో వారు ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మల్లయ్య, నాయకులు కిష్టంపేట రమేష్ రెడ్డి,ఉపాధ్యాయులు,విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img