Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ ను గ్లోబల్ సిటీ మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ మార్చడమే ప్రభుత్వ లక్ష్యం.. ! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ ను గ్లోబల్ సిటీ మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని ఆరోపించారు. మూసీ విషయంలో కుట్రపూరితంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని ఆరోపించారు. మూసీలో నివసించే ప్రజలకు మంచి జీవితం అందించడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అని పేర్కొన్నారు. ఒక్కరోజు మూసీలో పడుకుంటా అని కొందరు వెళ్లి మళ్ళీ వచ్చి విలాసవంతమైన బంగ్లాలో ఉంటున్నారు అని నిలదీశారు. మూసి నగర అభివృద్ధి కోసం రూ. 10 వేల కోట్లు కేటాయించాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Recent

- Advertisment -spot_img