తెలంగాణలో పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతులంతా పత్తిని ప్రైవేటు సంస్థలకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని సూచించారు. మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ చాట్ యాప్ ద్వారా దగ్గరలోని కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని మద్దతు ధరకు పత్తిని అమ్ముకోవాలని కోరారు. కాగా, రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లకు సీసీఐ అధికారులు 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.