హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై10 వేల మహిళలతో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి తెలిపారు. అమరవీరుల స్మారక కేంద్రం నుండి 10వ తేదీ సా.4 గంటలకు వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్ బండ్ పైకి చేరుకుంటారని పేర్కొన్నారు. వీరితోపాటు వందలాది మంది కళాకారులు తమ కళారూపాలతో ర్యాలీగా వస్తారని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.