తెలంగాణ వ్యాప్తంగా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో రైతు భరోసా పై ఒక సభలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తాం. రుణ మాఫీ పూర్తి కాగానే రైతు భరోసా అమలు చేస్తామని’’ అని ఆయన ప్రకటించారు.