ఇళ్లు లేని పేదలకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధి విధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు, విధివిధానాలను వారం, పదిరోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిసింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. వాటిలో ఇంటి కోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 82 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.