తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరసరఫరాల శాఖ ఓ అప్లికేషన్ విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో సాగుతోన్న ప్రచారంపై ప్రభుత్వం స్పందించింది. అవన్నీ వదంతులే అని.. తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ను ఇప్పటివరకూ రూపొందించలేదని స్పష్టత ఇచ్చింది. డిజిటల్ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని తేల్చిచెప్పింది.