ఆటో రిక్షా కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. థర్డ్ పార్టీ బీమా ప్రీమియం మొత్తాన్ని తగ్గిస్తూ ఆటో రిక్షాలకు ఊరట కలిగించింది.కేంద్రం నిర్ణయం ప్రకారం డీజిల్ లేదా గ్యాస్‌తో నడిచే ఆటోలపై వసూలు చేసే థర్డ్ పార్టీ ప్రీమియం ఒక్కో వాహనంపై రూ.2,371, ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,134 మించకూడదని స్పష్టం చేసింది. ఆరుగురు కంటే తక్కువ మంది ప్రయాణించే ఆటో రిక్షాలకు మాత్రమే ఈ పరిమితి వర్తిస్తుంది.
2022లో జారీ చేసిన నిబంధనల ప్రకారం డీజిల్ లేదా గ్యాస్‌తో నడిచే ఆటో రిక్షాలు థర్డ్ పార్టీ ప్రీమియం కింద ఒక్కో ఆటోపై రూ.2,539, ఒక్కో ప్రయాణికుడిపై రూ.1,214 చెల్లించాలి. అదే ఈ-ఆటోలైతే ఒక్కో వాహనంపై రూ.1,648, ఒక్కో ప్రయాణికుడిపై రూ.789 థర్డ్ పార్టీ ప్రీమియంగా చెల్లించాల్సి వచ్చేది. దీంతో వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిబంధనలు త్వరలోనే అమల్లోకి వస్తాయని, కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.