ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో చేతు వృత్తులు చేసుకుని స్వర్ణకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండల స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు బాలయ్య ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మంగారి దేవాలయం నుండి ప్రధాన రహదారి గుండా స్వర్ణకారులు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా చింతచి బాలయ్య మాట్లాడుతూ కార్పొరేట్ షాపుల వల్ల చేతివృత్తుల స్వర్ణకారుల జీవితాలు అతలాకుతులం అవుతున్నాయని అన్నారు. స్వర్ణకారులకు ప్రభుత్వం తరఫున రూ. 5 వేలు పెన్షన్, ఇల్లు లేని స్వర్ణకారులకు డబుల్ బెడ్ ఇల్లు అందివ్వాలి. ఉపాధి లేక ఆత్మహత్యకు పాల్పడిన స్వర్ణకారులకు ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాకుండా ముస్తాబాద్ నూతన బస్టాండ్ లో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి విగ్రహం ఏర్పాటు చేయాలని సబ్సిడీపై నగలు తయారీకి కావలసిన ముడి సరుకులు ఆధునిక యంత్రాలను సబ్సిడీలో అందజేయాలని కోరారు. అలాగే స్వర్ణకారుల హెల్పర్ బోర్డు ఏర్పాటు చేసి ఉపాధి కూలిపోతున్న స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల మండల అధ్యక్షులు చింతోజి బాలయ్య, తుమ్మనపల్లి సతీష్, చింతోజీ శ్రీనివాస నారోజు రాజు, వెంగళం శ్రీనివాస్, అనిల్, చింతోజీ సంతోష్, సత్యనారాయణ, బ్రహ్మ చారి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.