ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన 3 లక్షల రూపాయల విలువ గల 3 షాదిముబారక్ చెక్కులను సోమవారం రోజున ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్,వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మాజీ సర్పంచ్లు సత్యనారాయణ గౌడ్, చిర్ర గంగాధర్, సరుసని తిరుపతి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నేరెళ్ల మహేష్, మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,నాయకులు పురంశెట్టి వెంకటేశం, మార్కెట్ డైరెక్టర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.