వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్ మే 27న జరగనుండగా.. జూన్ 5న కౌంటింగ్ ఉంటుంది.