నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో 33 మంది అభ్యర్థులను ఇప్పటివరకు ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్నకు 1,23,210, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,514 ఓట్లు వచ్చాయి. గెలుపు కోసం 1,55,095 ఓట్లు అవసరం కాగా.. మల్లన్నకు 31,885, రాకేష్‌కు 50,581 ఓట్లు కావాలి.