Homeతెలంగాణప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగుల జీవితాలు పట్టవా..

ప్రైవేట్ విద్యా సంస్థల ఉద్యోగుల జీవితాలు పట్టవా..

హైదరాబాద్ : గల్లీ నుంచి హైదరాబాద్ దాకా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయ జీతాలు లేక కుటుంబ పోషణ భారమై అన్నమో రామచంద్ర అంటూ రోడ్లపై బిచ్చమెత్తుకుని దుర్మార్గ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ వల్లి ఉల్ల ఖాద్రీ పత్రిక ప్రకటనలో ఆరోపించారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో విద్యా సంస్థల యజమానులు ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదు, దీని కారణంగా కుటుంబ పోషణ భారమై వేలాది మంది ఉపాధ్యాయులు రోడ్లపై కూరగాయలు అమ్ముకోవడం, ఇతర కూలీ పనుల్లో నిమగ్నం కావడం విచారకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థల్లో నోటిఫికేషన్ లేని కారణంగా చదువుకు తగ్గ జాబ్ రాక అరకొర జీతాలతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆయన గుర్తు చేశారు.దేశ భవిష్యత్తు తరగతి నాలుగో గోడల మధ్యే భవిష్యత్ నిర్మాణమవుతుంది అలాంటి నిర్మాణానికి కేంద్ర బిందువైన ఉపాధ్యాయులకే ఇన్ని సమస్యలు ఉంటే తెలంగాణలో ఉన్న టిఆర్ఎస్ అనుకూల మేధావివర్గం ఎందుకు మౌనంగా ఉందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రవేటు పాఠశాలల యాజమాన్యాలను ఉద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని బలమైన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img